– పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు రోడ్డులో నివాసముంటున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు వీర్ల (దార్ల) సరోజిని కుమారుడు సురేంద్రనాథ్ (40) అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వారి నివాసానికి వెళ్లి, సురేంద్రనాథ్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని పవిత్రాత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మున్సిపల్ కౌన్సిలర్ తోట సుజలరాణి, కో-ఆప్షన్ సభ్యుడు ఫయాజ్ అలీ, నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, గుండు ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులర్పించారు.
రిటైర్డ్ హెచ్ఎం కుమారుడు సురేంద్ర నాథ్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



