Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్‌ పట్టా అందుకున్న ఇందారపు దావిద్ రాజ్

సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్‌ పట్టా అందుకున్న ఇందారపు దావిద్ రాజ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు రాజేశ్వరి-రవిందర్ దంపతుల కుమారుడు ఇందారపు దావిద్ రాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (Iఐఏఆర్ఈ) కళాశాలలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా కళాశాలలో ఆదివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో సైబర్  ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. తాడిచెర్ల నుంచి ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి సైబర్ సెక్యూరిటీ రంగంలో అడుగుపెట్టడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారం, తన కృషితో ఈ లక్ష్యాన్ని సాధించానని ఈ సందర్భంగా దావీద్ రాజ్ తెలిపారు. భవిష్యత్తులో సైబర్ సెక్యూరిటీ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -