Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

- Advertisement -

నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న 
నవతెలంగాణ-నెల్లికుదురు 
గ్రామంలో పేదల అభివృద్ధి  పరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు మద్ది రాజేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన పాలెపు ఉప్పలమ్మ సోమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ నూతన ఇళ్లను ప్రారంభించి వారికి నూతన వస్తువులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఆలయపు ఉప్పలమ్మ సోమయ్య మాట్లాడుతూ నాకు ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక నన్ను గుర్తించి నాకు ఇల్లు మంజూరు చేయించి డబ్బులు ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు గ్రామ సర్పంచ్ సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాకుండా గ్రామ సర్పంచ్ పులి వెంకన్న సులోచనలు మాకు నూతన వస్త్రాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు నాకు సంతోషంగా ఉందని నిలు నిర్మించుకోవడం నా కల నెరవేరింది అని అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఎంపీ బలరాం నాయక్ కి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ గ్రామ సర్పంచ్ పులి వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని పేదల అభివృద్ధి కోసమే కట్టుబడి ఉందని అన్నారు. పేదలను గుర్తించి వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా వారు తెలిపారు , ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్ది రాజేష్ , మద్ది కృష్ణమూర్తి, సలుగు వీరేష్ పులి సాంబయ్య ఆకుల రాములు సోమయ్య రమేష్ రాజు రాము  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -