Monday, September 7, 2026
E-PAPER
Homeజాతీయంప్రశ్న అడిగినందుకే దాడా?

ప్రశ్న అడిగినందుకే దాడా?

- Advertisement -

స్వతంత్ర, నిష్పాక్షిక విచారణకు డిమాండ్
మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల చర్యను ఖండించిన ఎడిటర్స్ గిల్డ్

న్యూఢిల్లీ : విధి నిర్వహణలో భాగంగా ప్రశ్న అడిగిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఘటనను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) తీవ్రంగా ఖండించింది. ఈ దాడి ఘటనపై వెంటనే స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ప్రముఖ యూట్యూబ్ వార్తా ఛానల్ 4పీఎం న్యూస్ నెట్‌వర్క్‌కు చెందిన మహిళా జర్నలిస్టులు షహీన్ ఖాన్, నఫీసా ఖాన్‌లపై ఈనెల 3న ఢిల్లీ పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమాన్ని వారు కవర్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు. సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రి కొత్త విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ప్రశ్నించేందుకు ప్రయత్నించామని ఇద్దరు జర్నలిస్టులు తెలిపారు. అయితే తమను పోలీసులు అడ్డుకుని, బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపించారు. అనంతరం పోలీసు వాహనంలో సాకేత్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని చెప్పారు.
పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసు సిబ్బంది తమపై దాడి చేసి కొట్టారని షహీన్ ఖాన్, నఫీసా ఖాన్ ఆరోపిం చారు. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. తమ పేర్లు చెప్పడంతో తమ మత గుర్తింపును పోలీసులు గుర్తించారని, ఆ తర్వాత తమపై దాడి మరింత తీవ్రంగా జరిగిం దని వారు ఆరోపించారు. పోలీసు సిబ్బంది తమ మతాన్ని లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడారని కూడా తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి తమ శరీరాలపై ఉన్న గాయాల గుర్తులను ఇద్దరు జర్నలిస్టులు వీడియో ద్వారా చూపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన వివరణపై ఎడిటర్స్ గిల్డ్ సందేహం వ్యక్తం చేసింది. సరిగా పార్క్ చేయని స్కూటర్ కారణంగా మార్గానికి అడ్డంకి ఏర్పడిందనీ, అందుకే వారిని అక్కడి నుంచి తొలగించామని ఢిల్లీ పోలీసులు చెప్తున్నప్పటికీ.. అందుబాటులో ఉన్న గాయాల వీడియోలు, జర్నలిస్టుల ఆరోపణల నేపథ్యంలో ఆ వివరణ నమ్మశక్యంగా లేదని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది.
ఈ ఘటనపై విడుదల చేసిన ప్రకటనలో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం, వారిపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన అంశమని పేర్కొంది. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై దాడి, మతాన్ని లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడారన్న ఆరోపణలపై సమగ్రంగా దర్యాప్తు జరగాల్సిన అవస రం ఉందని స్పష్టం చేసింది. ఈ ఆరోప ణలపై వెంటనే స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ చేపట్టాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. దర్యాప్తులో పోలీసు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని కోరింది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ కపూర్, ప్రధాన కార్యదర్శి రాఘవన్ శ్రీనివాసన్ ఈ ప్రకటనపై సంతకాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -