Monday, September 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..టెన్షన్ టెన్షన్

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..టెన్షన్ టెన్షన్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అంటోంది. అంతేకాదు బ్లాక్ డ్రెస్‌లో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆ పార్టీ నేతలు బయల్దేరారు. ముందుగా గన్ పార్క్ వద్ద నివాళులు ఆర్పించారు. ఇందిరమ్మ రాజ్యంలోఇంటింటికీ మోసం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరికాసేపట్లో అసెంబ్లీకి బయల్దేరనున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీని కనీసం 15 రోజులు అయినా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగా పలువురు నేతలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -