Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం హేయమైన చర్య 

అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం హేయమైన చర్య 

- Advertisement -

•యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ 
నవతెలంగాణ – మర్రిగూడ 
అసెంబ్లీకి వెళ్లకుండా మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ను అడ్డుకోవడం హేయమైన చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండలంలోని యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీష్ రావు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకుని, అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకు అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించే హక్కు ఉందన్నారు. ప్రతిపక్ష నేతలను సభకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, పోలీసు కేసులు, అరెస్టులతో ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయాలని చూడటం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -