- Advertisement -
న్యూఢిల్లీ : వైవాహిక అత్యాచారానికి మినహాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది విచారణ తేదీని కేంద్ర ప్రభుత్వ వాదన విన్న అనంతరం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ కేసులను నవంబర్‌కు వాయిదా వేయాలన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది జైసింగ్ ఈ పిటిషన్లను ప్రస్తావించారు.
- Advertisement -



