నవతెలంగాణ-మద్నూర్
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందనీ డోంగ్లీ మండల పరిధిలోని మోగా గ్రామ సర్పంచ్ బస్వంత్ హాలే అన్నారు. మంగళవారం గ్రామస్తులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా సంక్షేమం, గ్రామాలభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్‌కార్డులు అందుకున్న లబ్దిదారులు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాబు పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సంగ్రామ్ పటేల్, జిపిఓ రాజు, గ్రామ పెద్దలు రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.
సంక్షేమం, గ్రామాభివృద్దే ధ్యేయం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



