Tuesday, September 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

- Advertisement -

క్రీడల ప్రారంభోత్సవంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి
నవతెలంగాణ-మద్నూర్

విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఎదగాలనీ, మద్నూర్ మండల పేరును రాష్ట్రంలో నిలబెట్టాలని మద్నూర్ మేజర్‌ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అన్నారు. మండల స్థాయి క్రీడలను సర్పంచ్ విద్యాధికారి రాములు నాయక్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయనీ, చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని పేర్కొన్నారు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి మద్నూర్ విద్యార్థినీ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కోరారు. బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఈ పోటీలు రెండు రోజులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -