నవతెలంగాణ-మద్నూర్
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల ప్రజా పాలనపై బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో గల అంబేడ్కర్ విగ్రహానికి మద్నూర్, డోంగ్లి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలుపరుస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర ప్రజలకు మోసం చేసిందని విమర్శించారు. అధికారం చేపట్టి 1000 రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారనీ మండిపడ్డారు. వెంటనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, డోంగ్లి మండల పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ పటేల్, మద్నూర్ మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, ఇరు మండలాల ముఖ్య నాయకులు ,కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



