Tuesday, September 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

- Advertisement -

•నాంపల్లి సీఐ దూది రాజు 
నవతెలంగాణ-మర్రిగూడ 
నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని నాంపల్లి సీఐ దూది రాజు అన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూసుకోవాలని సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠాపనకు పోలీసుల అనుమతి తీసుకోవాలని, మండపాల ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యాలు, లైటింగ్‌ తదితర అంశాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. మండపాల వద్ద 24 గంటల భద్రతా చర్యలకు నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. మండపాలు ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగంపై నిబంధనలు పాటించాలని తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎస్సై బి.రాంబాబు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -