– 400 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ వితరణ
– క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేత
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టి నాయన) సహకారంతో శ్రీ దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 400 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు స్పోర్ట్స్ డ్రెస్సులు కావాలని దాసరి మధుమోహన్ రెడ్డిని కోరారు. వారి విన్నపానికి వెంటనే స్పందించిన ఆయన, మూడు రోజుల్లో ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులందరికీ, స్కూల్ బ్యాగ్స్ తో పాటు క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి సాయం చేసే మహానుభావుడు మన గ్రామంలో ఉండటం గంగారం ప్రజల అదృష్టం.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేసిన దాసరి మధుమోహన్ రెడ్డికి గంగారం గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి, నాయకులు కోలగట్ల చెన్నకేశవరావు, కావేటి అప్పారావు బెజవాడ శ్రీనివాసరావు, బండారు మారేశ్వరరావు, కరాటే రమేష్, యామాల ముత్యాలరావు, కాకర్ల మాణిక్యాలరావు, జల్లిపల్లి వాసుదేవరావు, కోటమర్తి జవహర్లాల్, చిన్ని వెంకటేశ్వరరావు, కాలసాని నాగేశ్వరరావు, రాచమళ్ల నాగేంద్రరావు, బండారు జగదీష్, కువ్వారపు కన్నయ్య, ఎస్కే సుభాని, కువ్వారపు గిరిబాబు, చల్లారి సత్యనారాయణ, కొండపల్లి మహేష్, బెజవాడ మనోజ్, మొగిలిచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు.



