Wednesday, September 9, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సస్పెండ్‌ చేయడం పెద్ద విషయం కాదు

సస్పెండ్‌ చేయడం పెద్ద విషయం కాదు

- Advertisement -

అధికారమున్నా ప్రజాస్వాయ్యయుతంగా వ్యవహరిస్తున్నా
సభకు రావాలని కేసీఆర్‌‌కు ఫోన్‌‌చేశానని వ్యాఖ్య
మీడియాతో చిట్‌‌చాట్‌‌లో స్పీకర్‌ ప్రసాద్‌‌కుమార్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ‌శాసన సభ్యులు తాతా మధుసూదన్‌‌పై చర్యలు తీసుకునే అధికారమున్నా ప్రజాస్వామ్యయుతంగా పోతున్నానని శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌ అన్నారు. ఆయన్ను సస్పెండ్‌ ‌చేయడం పెద్ద విషయం కాదనీ, సభ నుంచి క్షణాల్లో ఎత్తిపడేయెచ్చని అని అన్నారు. అయినా తాను శాసనసభ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నానని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్‌ ‌మీడియాతో చిట్‌‌చాట్‌ ‌చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ ‘‘శాసనసభలో సభ్యుడు కాకపోయినా తాతా మధుపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం నాకుంది…అయినా నేను అలా చేయలేదు..బీఆర్‌ఎస్‌ ‌సర్కారులా వెంటనే బహిష్కరించలేదు. ఏదైనా ప్రజాస్వాయ్యుతంగా వ్యవహరిస్తున్నాం..మహళా సభ్యులపై పోతీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రాహుల్‌‌గాంధీ పార్లమెంటులోకి నల్ల టీషర్ట్‌ ‌వేసుకుని వెళ్లారుగానీ, అదానీ ఫోటో పెట్టుకోలేదు..నేను ఢిల్లీకి మాట్లాడాను..విషయాలు తెలుసుకన్నా’ అని చెప్పారు. తాతా మధు వ్యవహారంలో కేసీఆర్‌ ‌వచ్చి క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం డిమాండ్‌ ‌చేస్తున్నది..సమావేశాలకు రావాలని ప్రతి సెషన్‌కు ముందు కేసీఆర్‌‌కు ఫోన్‌ ‌చేస్తూనే ఉన్నానని వివరించారు. ఆయన ఆరోగ్యం సహకరిస్తే వస్తానని అని చెప్పారని వివరించారు. గత సమావేశాల్లో కాల్‌ ‌చేశాననీ, వస్తున్నాననీ చెప్పి వచ్చి ఒక గంటసేపు ఉండి వెళ్లిపోయారని గుర్తు చేశారు. సభా నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నానని తెలిపారు.

మహిళా సభ్యుల విషయంలో విచారణకు ఆదేశించాం
మహిళా సభ్యుల విషయంలో ఉన్నతాధికారులతో నేను, సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడామనీ, విచారణకు ఆదేశించామని చెప్పారు. వీడియోల్లో బీఆర్‌ఎస్‌ ‌సభ్యుల ప్రవర్తన స్పష్టంగా కనిపించిందన్నారు. మహిళా పోలీసులను సైతం వాళ్లు కొట్టినట్టుగా వీడియోలో ఉందని ‌మీడియాకు చూపిస్తూ చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌సర్కారు హయాంలో రూపొందించిన నిబంధనలనే అమలుచేస్తున్నామని వివరించారు. నాకున్నా ఎనిమిదిమంది అక్కా చెల్లెళ్లతోపాటు సబితాఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి కూడా తన సోదరీమణులేనని స్పష్టం చేశారు. మహిళా సభ్యులపై దురుసు ప్రవర్తనకు సంబంధించి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇలా ఉంటే సభను నడపలేను
నేను ఈరోజు సభ నడపలేనని చెప్పాననీ, అందుకే ప్యానెల్‌ ‌స్పీకర్‌ ‌కడియం శ్రీహరికి బాధ్యతలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. గతంలోని స్పీకర్లు కేవలం అధికార పక్షంవైపు మాత్రమే చూసేవారనీ, నేను నాలుగువైపులా చూస్తూ సభ్యులకు అవకాశాలు ఇస్తున్నానని అన్నారు. నా జీవితంలో ఏనాడూ ఈ తరహా ఘటనలు ఎదురుకాలేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలో నాకు, సబితాఇంద్రారెడ్డికి మధ్య యుద్దం నడిచేదనీ, అయినా ఏ పరిస్థితుల్లోనూ ఇలా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. ఈరోజు రాష్ట్రమంతా ఉడికిపోతున్నదనీ, అయినా సంయమనం పాటిస్తున్నామని గుర్తుచేశారు. అసెంబ్లీ స్పీకర్ పరిధిలోనే తాతామధు అహంకార వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఒక్కరోజులోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ ‌చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అలా చేయదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -