- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటక పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోలీ, ఆయన కుమార్తె, చిక్కోడి ఎంపీ ప్రియాంకా జార్కిహోలీ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ప్రాపర్టీలకు సంబంధించిన కేసులో భాగంగా బెంగళూరు, బెల్గావి, గోకర్ణ తదితర ప్రాంతాల్లో మొత్తం 18 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న మంత్రి నివాసంతో పాటు ప్రియాంకా జార్కిహోలీ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. జార్కిహోలీ కుటుంబ వ్యాపారాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ కేసు పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
- Advertisement -



