– ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి
– చదును పనులు చేపట్టిన అధికారులు
– త్వరలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ
– అక్రమంగా పరిహారం పొందినవారిపై విచారణ చేపట్టాలి : వివిధ పార్టీల నాయకులు
నవతెలంగాణ-యాచారం
ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో పరిహారం పొందిన రైతులు ఎవరూ పంటలు వేయొద్దని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలో ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో శనివారం కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చదును పనులు చేపట్టారు. అలాగే, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. నాలుగు గ్రామాల్లో ఫార్మాసిటీకి సేకరించిన భూములకు సంబంధించి పరిహారం పొందిన రైతులు ఎలాంటి పంటలూ వేయొద్దని కోరారు. బాధిత రైతులకు త్వరలోనే ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం అందిస్తున్నట్టు తెలిపారు. ఫార్మాసిటీ భూములను తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. దీనికి రైతులు సహకరించాలని కోరారు. అయితే, బాధిత రైతులకు న్యాయం చేయాలని అన్ని పార్టీల నాయకులు ఆర్డీవోకు సూచించారు. అలాగే, అక్రమంగా పరిహారం పొందిన వారికి ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఇవ్వకుండా ఆపాలని కోరారు. అక్రమార్కుల లిస్టును బయటపెట్టాలన్నారు. ఫార్మాసిటీలో అక్రమంగా పరిహారం పొందిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అయ్యప్ప, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, మాజీ సర్పంచ్ ఎరుకలి బాలరాజ్, మాజీ ఎంపీటీసీ మోటే శ్రీశైలం, ఆడాల గణేష్, బేత జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫార్మా భూముల్లో పంటలు వేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



