Sunday, April 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎయిర్‌పోర్ట్‌ల ప్రక్రియను వేగవంతం చేయాలి

ఎయిర్‌పోర్ట్‌ల ప్రక్రియను వేగవంతం చేయాలి

- Advertisement -

ఏఏఐ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్ర సమగ్రాభివద్ది దిశగా ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతత్వంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ క్రమంలో వరంగల్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్దం చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ల నిర్మాణం వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్టు ప్రకటించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ సదరన్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజ్‌కిషోర్‌, ఏవియేషన్‌ డైరెక్టర్‌ భరత్‌రెడ్డి తదితరులతో కలిసి వరంగల్‌ , ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్ట్‌లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనులను త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించిందని గుర్తుచేశారు. వీలైనంత త్వరలో శంకుస్ధాపన చేస్తామని తెలియజేశారు.అలాగే ఆదిలాబాద్‌ విమానాశ్రయాన్ని డిఫెన్స్‌ (రక్షణ శాఖ) సివిల్‌ ఏవియేషన్‌ (పౌర విమానయాన శాఖ) , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివద్ధి చేయాలని నిర్ణయించాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ తక్షణమే సిద్దం చేయాలని సూచించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపిన నేపధ్యంలో దీనిపై మరింత లోతైన అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై ఒక నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -