Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకే అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ..విజ‌య్ కీల‌క నిర్ణ‌యం

టీవీకే అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ..విజ‌య్ కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజకవర్గంలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాంతో ఒక స్వతంత్ర అభ్యర్థికి టీవీకే మద్దతు ప్రకటించింది. టీవీకే చీఫ్‌ విజయ్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఎడప్పాడి నుంచి టీవీకే తరఫున దాఖలైన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దాంతో అక్కడి పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. ఈ తరుణంలో అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రేమ కుమార్‌కు పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ప్రేమకుమార్ తన చిరకాల మిత్రుడని, గతంలో తన అభిమాన సంఘం నిర్వాహకుడిగా పనిచేశాడని, సోదర సమానుడని విజయ్ తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమకుమార్‌కు అండగా నిలవాలని పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని విజయ్‌ తెలిపారు. ఎడప్పాడిలోని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు ప్రేమ్‌కుమార్‌కు కేటాయించిన ‘టెలివిజన్ సెట్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజయ్ విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్‌లోని గుర్తును, దాని సీరియల్ నెంబర్‌ను గుర్తించి ఓటు వేయాలని కోరారు. టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనప్పటికీ.. ప్రేమ‌కుమార్‌ను టీవీకే ప్రతినిధిగానే భావిస్తున్నామని అన్నారు. ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయ్ తన సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -