Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మంవిద్యార్థులకు 'రావు' ట్రస్ట్ బుక్స్, బ్యాగ్స్ వితరణ 

విద్యార్థులకు ‘రావు’ ట్రస్ట్ బుక్స్, బ్యాగ్స్ వితరణ 

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
పెనుబల్లి మండలం శ్రీనివాసపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సత్తుపల్లికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రావు లక్ష్మణరావు తోడ్పాటునందించారు. బుధవారం తన  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ‘రావు చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రూ. 5,000 విలువైన పుస్తకాలు, నోట్‌బుక్స్, బ్యాగులను విద్యార్థులకు వితరణ చేశారు. విద్యార్థుల చదువుకు ఉపయోగపడేలా సాయం అందించడం పట్ల ‘రావు’ ట్రస్టును, నిర్వహణ బాధ్యులు లక్ష్మణరావును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయురాలు ఎం. స్రవంతి అభినందించారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఇతరులు కూడా విద్యార్థుల వికాసానికి ముందుకు రావాలని కోరారు. వారి ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు  సమాజానికి అందాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -