- Advertisement -
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకను సింగరేణి సత్తుపల్లి ఏరియా ఏరియా జీఎం కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీఎం వెంకటాచారి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జీఎం వెంకటాచారితో పాటు వివిధ విభాగాల అధిపతులు, యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



