– నియోజకవర్గంలోనే తొలిసారిగా కరపత్ర ప్రచారం
– ఆవిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్
నవతెలంగాణ-సత్తుపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారానికి ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అయినంపూడి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గొర్లమారి రామ్మోహనరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోనే మొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్ ప్రారంభించారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు గ్రామానికి సుమారు రూ.6 కోట్ల మేర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించినట్లు వారు ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు.
గ్రామంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఇలా…
రూ.80 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, కొత్త 11 కేవీ విద్యుత్ లైన్ల కోసం రూ.15 లక్షలు, నెలకు రూ. 24 లక్షల చొప్పున విద్యుత్ సబ్సిడీ వస్తుందని తెలిపారు. అలాగే ఇప్పటివరకు రూ.36 లక్షల వరకు రైతు రుణమాఫీ సాయం అందిందన్నారు. 67 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా దాదాపు గృహప్రవేశాలు జరిగాన్నారు. వీరిలో 50 మందికి రూ.లక్ష చొప్పున రూ.50 లక్షల సాయం అందిందన్నారు. కొత్తగా 64 మందికి రేషన్ కార్డులు కార్డుల పంపిణీ జరిగిందన్నారు. 107 కుటుంబాలు సన్న బియ్యం అందుకోవడం జరుగుతుందన్నారు. ఇవిగాక వీఓ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు రాధ, రంగమ్మ, శ్యామల, ఇటికాల గోపి, దేశిరెడ్డి సౌజన్య నాయకులు దేశిరెడ్డి వెంకటరామిరెడ్డి, బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, బొమ్మారెడ్డి చిన్న వెంకటరెడ్డి, బొమ్మారెడ్డి కేశవరెడ్డి, పెద్ద గోపి, చింతల కృష్ణారెడ్డి, రవి, గద్దల రంగా, కొత్తపల్లి ప్రభాకరరావు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.



