Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ మండపానికి పోలీసుల అనుమతులు తప్పనిసరి

గణేష్ మండపానికి పోలీసుల అనుమతులు తప్పనిసరి

- Advertisement -

కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మండలం ఆయా గ్రామాల్లోని పురవీధుల్లో ప్రతిష్టపన చేసే నేపథ్యంలో నిర్వాహకులు కొయ్యుర్ పోలీసుల నుంచి తప్పకుండా అనుమతులు పొందాలని కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడారు గణేష్ విగ్రహ ఏర్పాటు చేసే నిర్వాహకులకు  పోలీస్ ఇంటిమేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందాలన్నారు.వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన నిర్వాహకులు ఆన్లైన్  ద్వారా ఇన్టిమేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.గణేష్ మండపం ఏర్పాటు చేసే ప్రదేశం,ప్రతిష్ఠాపన తేదీ,నిమజ్జనం  తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేస్తూ,నిర్వాహకుల పూర్తి వివరాలను,సంప్రదింపు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అందించాలన్నారు.పోలీస్ శాఖ సూచించే శాంతిభద్రతలు,ట్రాఫిక్ ఇతర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని,ఉత్సవ నిర్వాహకులు నిర్ణీత సమయంలో ఇన్టిమేషన్ దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -