- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
కాళోజీ నారాయరావు జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం కాళోజి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి స్వామి,కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ భాష యాస కొరకు తను రాసినటువంటి రచనలను నిజాం నవాబుల దమన నీతిని,అన్యాయాన్ని నిరసిస్తూ రాసిన రచనలను వివరించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



