- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. చంద్రబాబును మంచి మిత్రుడని, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. ప్రజలకు సేవ చేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
- Advertisement -



