నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు సాగుతున్నాయి.రాజ్‌ఘాట్‌లో లాంఛనప్రాయ స్వాగతం, నివాళుల అనంతరం జరిగిన ఈ చర్చలలో, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రత, ఏఐ (AI), కీలక ఖనిజ సరఫరా గొలుసులపై ప్రధానంగా దృష్టి సారించారు.
అంతకు ముందు దక్షిణ కొరియా నాయకుడికి రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో లాంఛనప్రాయ స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఇరు దేశాల జాతీయ జెండాలను ఊపుతూ ఉత్సాహభరితమైన ప్రదర్శన ఇచ్చారు. దక్షిణ కొరియా రాష్ట్రపతి, ప్రథమ మహిళ మూడు రోజుల అధికారిక పర్యటన భాగంగా ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా వారికి స్వాగతం పలికారు.



