Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్ని బీజేపీ పొలిటిక‌ల్ టూల్స్: క‌ర్నాట‌క మంత్రి

ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్ని బీజేపీ పొలిటిక‌ల్ టూల్స్: క‌ర్నాట‌క మంత్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: క‌ర్నాట‌క వ్యాప్తంగా ప‌లు కేంద్ర‌ ద‌ర్యాప్తు సంస్థ‌లు ఒక్క‌సారిగా త‌నిఖీలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ దాడుల‌ను ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే తీవ్రంగా ఖండించారు. ద‌ర్యాప్తు(Income Tax, Enforcement Directorate(ED), Central Bureau of Investigation(CBI)) సంస్థ‌ల‌ను బీజేపీ పొలిటిక‌ల్ టూల్స్ గా వాడుకుంటుంద‌ని ఎద్దేవా చేశారు. ఈ త‌ర‌హా దాడుల‌తో వారుఏమి చేయాల‌ని అనుకుంటున్నార‌ని, ఇంతకాలం వాళ్లు ఏం చేస్తున్నారు? అసలు ఈ సోదాలు ఎందుకు జరుపుతున్నారో కూడా త‌మ‌కు తెలియడం లేద‌ని మీడియా సమావేశంలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈడీ ఛార్జిషీట్ జారీ చేయనివ్వండి, అప్పుడు అసలు సోదాలు ఎందుకు జరుపుతున్నారో తెలుస్తుంది. ఈడీ నేర నిర్ధారణ రేటు కేవలం 2 శాతమే. వాళ్లు బీజేపీ ప్రభుత్వపు కీలుబొమ్మలు,” అని ఆయన పేర్కొన్నారు. కాగా సైబర్ క్రైమ్, మనీలాండరింగ్ నెట్‌వర్క్ కేసులో కర్ణాటక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్.ఎ. హారిస్ కుమారుడు, కుప్రసిద్ధ సైబర్ హ్యాకర్ అయిన శ్రీకృష్ణ రమేష్ అలియాస్ శ్రీకిపై చెందిన ప‌లు కార్యాల‌యాల్లో కర్ణాటక వ్యాప్తంగా ఈడీ సోదాలు జ‌రిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -