Thursday, September 10, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా పొలాల అమావాస్య పండగ 

ఘనంగా పొలాల అమావాస్య పండగ 

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు ఫార్డి (బి ), పల్సి, సోనారి, గోడపూర్, మలేగాం, తదితర గ్రామమలో గురువారం పొలాల పండగ ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామల్లో ఉన్న రైతులు బసవన్నలను ఉదయం నుంచి వాగులు, చేరువుల వద్దకు తీసుకువెళ్లి వాటిని శుభ్రంగా నీటితో కడిగి కొమ్ములకు రంగులు దిద్ది, వాటిపైన కొత్త జీన్లు వేసి అగరబత్తులు పెట్టి పత్రీ ఆకులను సమర్పించారు. అనంతరం డప్పుచప్పులతో  గ్రామమలో ఉన్న హనుమాన్, ఆలయాల హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఐదు ప్రదక్షిణలు వేశారు. తిరిగి ఇంటికి తీసుకువచ్చి పిండి వంటలతో బసవన్నలకు నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్బంగా గ్రామంలో రైతులు పాడి పశువులు, పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు మొక్కుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -