Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామగిరిలో ఉచిత వైద్య శిబిరం

శ్రీరామగిరిలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధవి ప్రశాంత్ 
నవతెలంగాణ-నెల్లికుదురు

శ్రీరామగిరి గ్రామంలో ప్రజావైద్యంలో సాయిరాం గ్యాస్ట్రో, లివర్ సెంటర్ అధునాతన వైద్యసేవలతో ఉచితంగా క్యాంపు నిర్వహించి ముందడుగు వేయడం శుభపరిణామమని గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ అన్నారు. గురువారం శ్రీరామగిరి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వైద్యశిబిరానికి ఖమ్మంలోని ప్రముఖ గ్యాస్ట్రో, లివర్ సెంటర్గా గుర్తింపు పొందిన సాయిరాం హాస్పిటల్స్, జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా సహకారంతో విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. పేదలకు అతితక్కువకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సాయిరాం హాస్పిటల్స్ అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందించదగిన విషయమన్నారు.

ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరంలో గ్యాస్ట్రో, లివర్, ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన సమస్యలతో పాటు కిడ్నీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రో, గ్యాస్ట్రో మెడిసిన్, ఆంకాలజీ, కార్డియాలజీ, అంకాలజీ, డయాబెటిక్, సైనస్, ఆప్తమాలజీ, జనరల్ సర్జన్, డెర్మటాలజీ, తదితర విభాగాలకు చెందిన గుర్తింపు పొందిన వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా పరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా, సాయి రామ్ హాస్పిటల్స్  డా. సునీల్ కుమార్ జంగాల ఎండి డిఎం, సాయిరామ్ హాస్పిటల్, ఎండి  డా. స్వాతి జంగాల ఎంబిబిఎస్, డి ఐ ఏ బి సహకారంతో డా. ప్రశాంతి ఎంబిబి ఎస్. డా.తబస్సుమ్ ఏం బి బి ఎస్

జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్. ఫౌండేషన్  డైరెక్టర్ సామ్యూల్ గెడ్డం, మరియు, నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ సహకరించారు. వారికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రామగిరి సుమన్ వార్డు సభ్యులు అంగోతు పంతులు, గొల్లపెల్లి వేణు, జంజిరాల నరేష్గ్రామ పెద్దలు గొల్లపెల్లి ప్రభాకర్, ఆధురి కళదార్ రాజ్ .ఎడ్ల మహేష్. రొయ్యల చంటి, గుర్రాల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -