జిల్లా కలెక్టర్, ఎస్పీ
నవతెలంగాణ -ముధోల్
రానున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఈఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, ఐఏఎస్, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగావారుమాట్లాడారు.సమావేశంలో బాసర ఆలయ అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లు, భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భక్తుల రాకపోకల నిర్వహణ తదితరఅంశాలపైసమగ్రంగాచర్చించారు.గోదావరి పుష్కరాలసందర్భంగా బాసర ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు, వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని వారు సూచించారు.
ఆనంతరం గోదావరి పుష్కరాలు–2027, బాసర ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్ను తరలించేందుకు ప్రతిపాదించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, సందర్శించి పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన భద్రతా అవసరాలు, సిబ్బంది విధుల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.బాసర ఆలయానికి వచ్చే భక్తులతో పాటు గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పుష్కరాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో అవసరమైన భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సాయి కిరణ్, ముధోల్ సిఐ రవీందర్ నాయక్, బాసర ఎస్ హెచ్ ఓ దీపక్, బాసర ఆలయ ఈఓ అంజనా దేవి, వివిధ శాఖ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది. పాల్గొన్నారు.


