Thursday, September 10, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలి: ఎంపీఓ

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలి: ఎంపీఓ

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి వారికి అవసరమైన సౌకర్యలు కల్పించేలా ప్రత్యేక శ్రద్దా చూపాలని మండల ప్రత్యేక అధికారి గృహ నిర్మాణా శాఖ పీడీ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన కుభీర్ ఆశ్రమ పాఠశాల,మరియు భవిత విద్య వనరుల కేంద్ర భావనన్ని పరిశీలించి అక్కడి నుంచి ఫార్డి( బి ) ప్రాథమిక ఆరోగ్య కేంద్ర న్ని మండల ఎంపీడీఓ భూమరావుతో కలసి తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామమలో ఉన్న ప్రజలకు వైద్య సేవలు తప్పనిసరిగా అందించేలా చూడలని అన్నారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ భూమరావు సర్పంచ్ మడి ప్రవీణ్ ఉపాధ్యాయులు మురళి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్స్ విద్యార్ధి విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -