Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ అరెస్టులు అన్యాయం

అక్రమ అరెస్టులు అన్యాయం

- Advertisement -

మహబూబాద్ నియోజకవర్గ విద్యార్థి నేత తుళ్ల వివేక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాడని ముందస్తుగా మహబూబాబాద్ నియోజకవర్గ వీఆర్ఎస్వీ విద్యార్థి నేత తుళ్ల వివేకను ముందస్తు అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం చేయడమని బీఆర్ఎస్వి నేత వివేక్ ప్రభుత్వంపై మండిపడినట్లు తెలిపారు. గురువారం పోలీసులు ఉదయం ఆరు గంటలకే ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సరైన కాదని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎంతో మందిని ఆక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో కనీసం వారి హక్కుల కోసం అడిగే హక్కు లేకుండా పోతుందని అన్నారు.

సమస్యల పరిష్కారం కోసం ఏ కార్యక్రమాలు కూడా చేయనేకుండా అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల నిరసన హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా, నిరసనలకు ముందే అరెస్టులు చేయడం సరికాదన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో విద్యార్థుల గొంతుకను అణచలేరు అని అన్నాడు. యూత్ డిక్లరేషన్ అమలు కోసం,విద్యార్థుల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -