Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు క్లస్టర్ రైతులు రైతు ఐడి నమోదు చేసుకోవాలి 

ఆలేరు క్లస్టర్ రైతులు రైతు ఐడి నమోదు చేసుకోవాలి 

- Advertisement -

ఆలేరు క్లస్టర్ ఏఈఓ మణికంఠ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

ఆలేరు క్లస్టర్ క్రింద ఉన్న గ్రామాలలోని రైతులందరూ రైతు ఐడి తప్పనిసరి చేయించుకోవాలని ఆలేరు గ్రామ క్లస్టర్ మణికంఠ తెలిపారు. గురువారం ఆలేరు రైతు వేదికలో మాట్లాడుతూ.. ఆలేరు క్లస్టర్ పరిధిలో రైతు ఐడి కోసం నమోదు చేసుకోని రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పిఎం, కిసాన్ తదితర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు రైతు ఐడి నమోదు కీలకం అని అన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొనుగోళ్ల కోసం కొత్తగా యాప్  విధానాన్ని అమలు చేస్తోంది అని తెలిపారు. రైతు ఐడి లేకుండా కొత్త విధానంలో ఎరువులు పొందడం రాబోయే రోజుల్లో సాధ్యం కాదని చెప్పారు. రైతులందరూ రైతు ఐడి నమోదు చేసుకోవాలని, స్థానిక ఈ జీవోను ను సంప్రదించాలని ఆయన సూచించారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -