Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రిటైర్డ్ ఉపాధ్యాయుడు పల్లె ఉప్పలయ్య మృతి

రిటైర్డ్ ఉపాధ్యాయుడు పల్లె ఉప్పలయ్య మృతి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఆలేరు సర్పంచిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన పల్లె రమాదేవి, భర్త రిటైర్డ్ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు నిర్వర్తించిన పల్లె ఉప్పలయ్య (ఉపాధ్యాయుడు) అనారోగ్యంతో గత కొంత కాలంగా చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఉప్పలయ్య ఎంతో విలువలతో జీవించారు.అందరితో కలిసి మెలసి ఉంటూ.. ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎంతో ఆప్యాయతతో  పలకరించేవారు. మృదు స్వభావం కలిగిన ఉప్పలయ్య ఆపదలో ఉన్నవారిని దగ్గరికి తీయడంలో ముందుండే వారు.

ఆయన మృతి పట్ల పట్టణంలోని రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు మండలంలోని మంత్రపురి గ్రామంలో నిర్వహించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -