Monday, April 20, 2026
E-PAPER
Homeకరీంనగర్రైతులకు మద్దతు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలు

రైతులకు మద్దతు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలు

- Advertisement -

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తాడూర్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి

రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు అందించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్ళపల్లి మండలం తాడూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన టెంట్, నీటి వసతి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.

జిల్లావ్యాప్తంగా రైతుల సౌకర్యం కోసం ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఇతర శాఖల ఆధ్వర్యంలో మొత్తం 239 కొనుగోలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సరైన తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ పై ఇప్పటికే మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ, జిల్లా వ్యవసాయ అధికారి, సహకార శాఖ అధికారి, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు.

కొనుగోలుకు కావలసిన ఎలక్ట్రానిక్ యంత్రాలు, గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వేసవి నేపథ్యంలో రైతుల కోసం టెంట్లు, నీటి వసతి, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  స్వరూపారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింగం, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ గీత,తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -