Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి

- Advertisement -

• ప్రధానోపాధ్యాయుడు బానోత్ భీమా 
నవతెలంగాణ -పెద్దవంగర 
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అవుతాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ భీమా నాయక్ అన్నారు. సోమవారం గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రతిభ కలిగిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం ప్ర‌భుత్వం అందిస్తోందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. మా పాఠశాలలో ఫ్రెండీ టీచింగ్ నిర్వహిస్తూ, పది వేల పుస్తకాలతో రీడింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ మన అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిరంజీవి, ప్రతిభ, మంజుల, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -