Friday, September 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకార్గో నౌకలో అగ్నిప్రమాదం

కార్గో నౌకలో అగ్నిప్రమాదం

- Advertisement -

చైనాలో 25 మంది మృతి
ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరం
చేయాలి : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు

బీజింగ్: చైనాలోని చింగ్డావో బెహై షిప్‌యార్డ్‌లో ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 25 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఓషన్‌ మెలోడీ’ అనే సరకు రవాణా నౌక.. మరమ్మతుల కోసం చింగ్డావో బెహై షిప్‌యార్డ్‌లో ఆగింది. అక్కడే నౌకలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 42 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థ లంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షు డు జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని, బాధితులకు సాయం అందించాలని సూచించారు. మరోవైపు, ఈ నౌకలో చిక్కుకున్న సిబ్బందిని రక్షించడం, గాయపడిన వారికి చికిత్స అందించడంపై దృష్టి పెట్టాలని చైనా ప్రధాని లీ కియాంగ్ అత్యవసర బృందాలను ఆదేశించారు. చింగ్డావో బెహై అనేది ‘చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్’ ఆధ్వర్యం లోని ఒక ప్రధాన షిప్‌యార్డ్. ఇక్కడ వాణిజ్య నౌకల నిర్మాణం, మరమ్మ తులు వంటివి చేస్తుంటారు. తీరప్రాం తం వెంబడి 9 కిలోమీటర్ల మేర 815 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -