ఐదు ఎకరాలు మంటల్లో బూడిదైన మొక్కజొన్న పంట
నవతెలంగాణ – మిడ్జిల్
ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన పంట ప్రమోదవశాత్తు మంటలు అంటుకొని ఐదు ఎకరాలలో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన సంఘటన సోమవారం మండలంలోని మండలం వేముల గ్రామ పంచాయతీ తమ్మడి కుంటలో చోటుచేసుకుంది. రైతు రవినాయక్, శ్రీను నాయక్ కు చెందిన గిరిజన రైతుల మొక్క జొన్న పంట ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకుంటూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట అగ్గిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. మిట్ట మధ్యాహ్నం మంటలు చెలరేగి చేతికొచ్చిన పంట మంటల్లో కాలిపోతుండగా చూసి పక్క రైతులు, గిరిజన తండావాసులు బోరు బావుల తోటి పైపుల ద్వారా మంటలను అదుపుచేసే క్రమంలో ప్రమాదవశాత్తు రైతు చేతుకు మంటలు అంటుకొని తీవ్ర గాయలయ్యాయి. మంటలు ఆర్పకుంటే మరో ఐదు ఎకరాల వరకు మొక్క పంట కాలిపోయే ప్రమాదం ఉండేది అని రైతులు చెప్పారు. పంట చుట్టూ మూగజీవాలు గొర్లు, పశువులు మేకలు కూడా చనిపోయే ప్రమాదం ఉండేదని తెలిపారు. చేతికొచ్చిన పంట కాలి బూడిదైందని, ప్రభుత్వ ఆర్థికంగా ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
ప్రమాదవశాత్తూ మొక్కజొన్న పంట దగ్దం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



