మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్
నవతెలంగాణ-హైదరాబాద్ :
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అదుపు తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించాలని ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, మాజీ కార్యదర్శులు టి. శేషు నారాయణ, కె. జాన్ మనోజ్‌లు కోరారు. ఇటీవల హెచ్‌సీఏలో క్రికెట్ నిర్వహణ, అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని మాజీ ఆఫీస్‌బేరర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘హెచ్‌సీఏలో నిబంధనలను గాలికొదిలేయటం చూస్తే ఎంతో బాధగా ఉంది. రూల్స్‌ను పాటించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ నష్టపోతుంది. నిబంధనలు పాటించటంపై అడ్మినిస్ట్రేటర్లకు కనీస ధ్యాస లేదు. సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయకుండా సీజన్‌ను ఎలా ఆరంభిస్తారు? సెలక్టర్లు లేకుండా రాష్ట్ర జట్లను ఏ విధంగా ఎంపిక చేస్తారు?గత సీజన్‌లో సీజన్ మొదలయ్యాక సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు? మ్యాచ్‌లు చూడకుండా జట్లను ఎలా ఎంపిక చేస్తారు. సెలక్షన్ కమిటీ నియామకంపై హెచ్‌సీఏ రాజ్యాంగంలో స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. సెలక్షన్ కమిటీ, స్టాండింగ్ కమిటీ సహా టీపీఎల్ వంటి లీగ్‌ల నిర్వహణ నిర్ణయాలను వార్షిక సర్వ సభ్య సమావేశంలోనే తీసుకోవాలి. క్రికెట్, క్రికెటర్లు నష్టపోకుండా ఇప్పుడైనా ఏజీఎం నిర్వహించి.. హెచ్‌సీఏను గాడిలో పెట్టాలని కార్యదర్శి జీవన్‌రెడ్డిని కోరుతున్నాను’ అని అర్షద్ అయూబ్ అన్నాడు.
ఏజీఎం నిర్వహించండి
- Advertisement -
- Advertisement -



