Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి

ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి

- Advertisement -
  • బీసీల ధర్మ పోరాట దీక్షలో నాయకులు
  • నవతెలంగాణ – కామారెడ్డి
  • జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేపట్టి ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిబాపూలే ప్రాంగణంలో బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాప శివరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీ కులగణనను శాస్త్రీయ, పారదర్శక పద్ధతిలో నిర్వహించి ప్రతి కులాన్ని నమోదు చేయాలని కోరారు. కులగణన లేకుండా జనగణన నిర్వహిస్తే ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో బీసీ కులగణన నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులాల లెక్కింపు చేపట్టడం లేదని వారు ఆరోపించారు.
  • ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్‌తో కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను బీసీల హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలుగా వారు అభివర్ణించారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు ముందుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. దేశ సంపద, సహజ వనరులపై సమాన హక్కులు కల్పించి, జనాభా దామాషా ప్రకారం వనరుల పంపిణీ జరిగిన తర్వాతే రిజర్వేషన్లపై చర్చ జరగాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జనగణనలో కులగణనను చేర్చాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీక్షకు మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సంఘీభావం తెలిపి, నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కోఆప్షన్ సభ్యుడు కుంబాల రవి, పలువురు కౌన్సిలర్లు దీక్షకు మద్దతు తెలిపారు.
  • కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బాజ లలిత, క్యాతం సిద్ధరాములు, గణేష్ నాయక్, తాహెర్, కొత్తపల్లి మల్లన్న, ఒడ్డె ఎల్లయ్య, చాకలి రాజయ్య, వెంకటస్వామి, విఠల్, రమేష్, ప్రవీణ్, హజీజ్, కాంగ్రెస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -