వెల్లడించిన నేపాల్ ప్రధాని
స్వాగతించిన దళిత కార్యకర్తలు
ఖాట్మండు : నేపాల్ కొత్త ప్రభుత్వం, ప్రధానమంత్రి బాలేంద్ర షా 100-పాయింట్ల సంస్కరణల ఎజెండాలో భాగంగా, దళితులకు చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలకు 15 రోజులలోపు ”అధికారిక ప్రభుత్వ క్షమాపణ” జారీ చేస్తుందని ప్రకటించింది. తరతరాలుగా కొనసాగుతున్న కుల ఆధారిత వివక్ష, బహిష్కరణ, అవకాశాల నిరాకరణకు ఇది ఒక చారిత్రాత్మక అంగీకారమని పలువురు అభివర్ణించారు. అయితే ఈ క్షమాపణతో పాటు సామాజిక న్యాయం, సమ్మిళిత పునరుద్ధరణ, చారిత్రక సయోధ్యకు సంబంధించిన చర్యలు కూడా చేపట్టాలని పలువురు కోరుతున్నారు. నేపాల్ ప్రభుత్వం విడుదల చేసిన సంస్కరణల నివేదికలో ” ప్రభుత్వ, సమాజం , విధాన నిర్మాణాల ద్వారా దళితులు, చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలపై జరిగిన అన్యాయం, వివక్ష, అవకాశాల నిరాకరణను మేము అధికారికంగా అంగీకరిస్తాము, సామాజిక న్యాయం, సమ్మిళిత పునరుద్ధరణ, చారిత్రక సయోధ్యకు పునాదిని సిద్ధం చేస్తాము.” అని పేర్కొంది. నేపాల్ జనాభాలో దళితులు సుమారు 13-14 శాతం ఉన్నారు, అయితే రాజ్యాంగ హక్కులు ,కుల వివక్షత , అంటరానితనానికి వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ, వారు అనేక అవమానాలను, బహిష్కరణలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 42 శాతం దళితులు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని, అక్షరాస్యత జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని, కీలక సంస్థలలో ప్రాతినిధ్యం అసమానంగా తక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. బైతాడిలోని దళిత సొసైటీ డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షురాలు సరస్వతి నేపాలీ, తాను చిన్నతనంలో దళిత్ కావడంతో తన సహవిద్యార్థులతో ఒకే కుండ నుండి నీరు తాగడానికి అనుమతించలేదని, నీటి కోసం ఇంటికి నడవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
దళితులకు 15 రోజుల్లో అధికారిక క్షమాపణలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



