Tuesday, April 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతుసంఘం రాష్ట్ర 3వ మహాసభలకు కొత్తగూడెం సిద్ధం

రైతుసంఘం రాష్ట్ర 3వ మహాసభలకు కొత్తగూడెం సిద్ధం

- Advertisement -

– ముస్తాబైన పారిశ్రామిక కేంద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం

రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వ్యవసాయ రంగాన్ని రక్షించటానికి కృషి చేస్తున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ నడిబొడ్డున ఈ నెల 23, 24, 25 తేదీలలో జరుగబోతున్నాయి. స్థానిక కొత్తగూడెం క్లబ్‌ నందు మూడు రోజుల పాటు మహాసభలు నిర్వహించేందుకు నిర్వహక సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగూడెం పట్టణాన్ని ఇప్పటికే రైతు సంఘం జెండాలు, తోరణాలతో అలంకరించారు. ప్రధాన కూడళ్లు రైతు సంఘం జెండాలు, తోరణాలతో మహాసభలకు హాజరు కానున్న ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నాయి. సుమారు 600 మంది రాష్ట్ర మహాసభలకు ప్రతినిధులుగా హాజరు కానున్నారు.
రాష్ట్రంలో రైతాంగ ప్రధాన సమస్యలైన గిట్టుబాటు ధర, బీమా సౌకర్యం, బోనస్‌, రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలపై నిరంతరం రైతు సంఘం పోరాడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందించాలని పోరాడుతుంది. భవిష్యత్‌ కార్మిక, కర్షక, ప్రజా పోరాటాలకు మద్దతుగా జరుగబోతున్న ఈ మహాసభల జయప్రదానికి ప్రముఖులు, మేధావులు, రైతు శ్రేయోభిలాషులు అన్నివిధాలుగా సహకరించి విజయవంతం చేయాలని రైతు సంఘం నేతలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -