- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఎండల మధ్య వరుస పర్యటనలు, ఇటీవల సిరిసిల్లలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొనడం వల్ల ఆయనకు వడదెబ్బ తగిలినట్లు సమాచారం. దీంతో జ్వరం, డీహైడ్రేషన్, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటూ చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగానే జగిత్యాలలో జరిగిన కేసీఆర్ సభకు ఆయన హాజరు కాలేకపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
- Advertisement -



