- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికా అమలు, రోహిత్ వేముల చట్టంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



