Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త అనుభూతినిచ్చే ‘ప్యారడైజ్‌’

సరికొత్త అనుభూతినిచ్చే ‘ప్యారడైజ్‌’

- Advertisement -

హీరో నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, ‘ఆయా షేర్, ఏష నాగుల కట్ట, గ్లింప్స్, టీజర్.. సినిమా నుంచి ఏ కంటెంట్ ఇచ్చినా సరే అన్నింటికీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మీరు సినిమాని అంతగా సొంతం చేసుకున్నట్టు చూస్తుంటే మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఈ సినిమాకి ఒక డెస్టినీ ఉంది అనే బలమైన నమ్మకం వచ్చింది. ఈనెల 24న ఆడియన్స్‌కి ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నాం. మా టార్గెట్ ఒకటే. మీరందరూ చాలా అంచనాలతో థియేటర్‌కి వస్తారని తెలుసు. మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక అడ్రినలిన్ పంపింగ్, హై ఇచ్చి ఇంటికి పంపించా లనేది మా తపన’ అని తెలిపారు. ‘ఇది నా ‘సినిమా’ అనే కంటే ‘జనం సినిమా’ అనడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అంతలా ఈ కంటెంట్‌ను ఆదరించారు. ఇది రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం. ఒక తల్లి, కొడుకుల కథ. ఒక సవారీ జాతి కథ. ఇందులో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది’ అని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పారు. నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుగు ఆడియన్స్‌కి ఎలాంటి ఎక్స్‌పీరి యన్స్ ఇచ్చిందో, మిగతా ఆడియన్స్‌కి కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా చేశాం. శ్రీకాంత్ విజన్‌తో పెద్ద స్కేల్‌లో ఈ సినిమా థియేటర్‌లోకి వస్తుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -