Saturday, September 12, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పెండ్లయితే ప్రేమ తగ్గుతుందా..?

పెండ్లయితే ప్రేమ తగ్గుతుందా..?

- Advertisement -

ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామి గురించి నితరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. వారిలోని లోపాలననారాడా పట్టించుకోము. డమే. ఆ సమయంలో తప్పులు కూడా ఒప్పులుగా కనిపిస్తాయి. ఇద్దరూ కలిసి ఉండటంలోనే ఎంతో ఆనందం ఉందని భావిస్తారు. శాశ్వతంగా ఇలాగే జీవితాంతం ఉండాలని కలలు కంటారు. కానీ పెండ్లి తర్వాత, కాలం గడుస్తున్న కొద్ది ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గుతుంది. ప్రేమ కూడా తగ్గిపోతుంది. అది తగ్గిపోకుండా చూసుకోవడం ఇద్దరి బాధ్యత. అలా లేనప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో ఈవారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)‌లో చదువుదాం…

వాణికి సుమారు 48 ఏండ్లు ఉంటాయి. ఆమెకు పెండ్లి జరిగి దాదాపుగా 23 ఏండ్లు అవుతుంది. నారాయణను ప్రేమ వివాహం చేసుకుంది. ఒక పాప, బాబు ఉన్నారు. ఇద్దరూ చదువుకుంటున్నారు. వీళ్లు ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. పెండ్లికి ముందు వీరిద్దరిది పదేండ్ల పరిచయం. ఇంట్లో వాళ్లను ఒప్పించి రిజిస్ట్రర్‌ పెండ్లి చేసుకిన్నారు. ‌పెండ్లికి ముందు వాణిని, నారాయణ ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఆమెపై అస్సలు కోపమే వచ్చేది కాదు. ఆమె ఏం చెప్పినా వినేవాడు. వీళ్లు గంటల తరబడి మాట్లాడుకునేవారు. కాలేజీకి వెళ్లకుండా షికార్లు చేసేవారు. పెండ్లయిన కొత్తలో ఇంటికి తొందరగా వచ్చే అతను మెల్లమెల్లగా ఆలస్యం చేయడం మొదలుపెట్టాడు. వాణితో మాట్లాడడం కూడా తగ్గించాడు. నెమ్మదిగా అతనికి భార్యపై ప్రేమ తగ్గిపోయింది. వాణి మాత్రం అతనితో అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. కానీ అతనిలో ఎందుకు మార్పు వచ్చిందో ఆమెకు తెలియడం లేదు. నారాయణ ఇంట్లో సరిగా ఉండడం లేదు. ఆఫీసు నుండి వచ్చి వెంటనే బయటకు వెళ్లిపోతాడు. తిరిగి 2,3 గంటలకు వస్తాడు. నారాయణ ప్రభావం పిల్లలపై కూడా పడింది. బాబు కూడా వాణికి చెప్పకుండా స్నేహితులతో బయటకు వెళ్లి ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు.

నారాయణ ఫంక్షన్లలో తాగి చుట్టుపక్కల వారితో, బంధువులతో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. వాణి ఏమైనా అంటే ‘నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. ఇష్టమైతే ఉండు లేదంటే పో’ అంటూ రెండు మూడు సార్లు ఇంటి నుండి బయటకు గెంటేశాడు. ఆమెకు తల్లిదండ్రులు, అన్నయ్య ఉన్నా పెద్దగా పట్టించుకోరు. పైగా ‘ప్రేమించి పెండ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వే భరించు’ అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నారాయణ చేసిన పని వల్ల వాణి చాలా బాధపడింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక సలహా కోసం ఐద్వా అదాలత్‌‌కు వచ్చింది. తన భర్త ప్రవర్తన గురించి చెప్పి ‘మేడమ్‌ మా పిన్ని కూతురు సుకన్య భర్త చనిపోయి 15 ఏండ్లు అవుతుంది. అప్పటి నుండి ఆమె తన తల్లిదండ్రులతోనే ఉంటుంది. ఆమెతో నారాయణ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. నారాయణ పెండ్లికి ముందు నుండే సుకన్యతో క్లోజ్‌‌గా ఉండేవాడు. ఎందుకంటే మా ఇద్దరి ప్రేమ, పెండ్లి విషయంలో సుకన్య చాలా సాయం చేసింది. కానీ ఇద్దరి మధ్య ఇలాంటి సంబంధం ఏర్పడుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంట్లో నన్ను అస్సలు గౌరవించడం లేదు. పదేండ్లు ప్రేమ ప్రేమ అంటూ నా వెనకబడి ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు మీరే న్యాయం చేయాలి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

మేము నారాయణను పిలిపించి మాట్లాడితే ‘పెండ్లికి ముందులా ఇప్పుడూ ఉండాలంటే ఎలా కుదురుతుంది. అప్పుడు ఎలాంటి బాధ్యతలు ఉండవు కాబట్టి ఒకరికోసం ఒకరం ఏమైనా చేస్తాం. ఇప్పుడు అలా కాదు. కుటుంబం, పిల్లలు ఇలా బాధ్యతలు చాలా ఉంటాయి. ఎప్పుడూ ఆమెతో మాట్లాడుతూ, తిరుగుతూ ఉండడం ఎలా కుదురుతుంది. ప్రతి విషయానికి ఇలా పంచాయితి పెడుతుంది’ అన్నాడు. దానికి ఆమె ‘బాధ్యతలు ఆయనకు మాత్రమే కాదు నాకూ ఉన్నాయి. అసలు బాధ్యత అంటే ఏమిటీ? ఇల్లూ, పిల్లల్ని పట్టించుకోకుండా తిరగడమా? ఆయనకంటే నేను ఎక్కువే సంపాదిస్తున్నాను. ఇంటి కోసం ఆయనతో పాటు నేను కూడా ఖర్చు చేస్తున్నాను. నాకు కూడా చాలా టెన్షన్స్‌ ఉన్నాయి. కానీ నేను ఎప్పుడూ తాగుతూ కూర్చోలేదే. ఇల్లు వదిలి బయట తిరగలేదే? ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదే? తాగడం, గట్టిగట్టిగా అరవడమేనా బాధ్యత అంటే?’ అంటూ నిలదీసింది. వాణి అడిగిన ఏ ప్రశ్నకూ అతని దగ్గర సరైన సమాధానాలు లేక ‘ఆమెతో మాట్లాడితే ఏముంది, ఎప్పుడూ మీ అమ్మానాన్న ఇలా అన్నారు, పిల్లలు ఇది చేశారు, అది చేశారు అని తప్ప ఇంకేం చెబుతుంది. అందుకే మాట్లాడడం తగ్గించాను. ఇక నాకు ముందు నుండే తాగే అలవాటు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కాస్త పెరిగింది.

ఆమె గోల భరించలేక బయట తిరుగుతున్నాను. నా స్నేహితులతో తిరగడం కూడా తప్పేనా? వేరే వారితో మాత్రం నాకు సబంధం లేదు. అయితే సుకన్య అంటే నాకు ఇష్టం ఉన్న మాట మాత్రం వాస్తవమే. నేను చేస్తుంది తప్పు అని తెలిసి సరిచేసుకున్నాను. దాని ప్రభావం పిల్లలపై పడుతుంది. ఆలోచించి మార్చుకున్నాను. అక్కడి నుండి ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్లిపోయాము’ అన్నాడు. దానికి మేము ‘మీకు ఇప్పుడు 50 ఏండ్లు వచ్చాయి. మీ పిల్లలకు పెండ్లి చేసే వయసు వచ్చింది. ఇలాంటి పనులు చేయడం ఎంత వరకు సరైనది. మీరు ఇంటికి ఆలస్యంగా వస్తుంటే మీ అబ్బాయి కూడా చెప్పాపెట్టకుండా బయటకు వెళుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. మీలో మార్పు వచ్చింది నిజమే అయితే మంచిది. లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయి. మంచి కుటుంబాన్ని అనవసరంగా చిన్నాభిన్నం చేసుకోవద్దు. ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఇద్దరూ పిల్లలతో సంతోషంగా ఉండండి. పెండ్లి అయితే ప్రేమ తగ్గుతుందని ఎవరు చెప్పారు. మీరిద్దరూ మంచిగా ఉంటేనే మీ పిల్లల జీవితం బాగుంటుంది. లేదంటే మీ ఇష్టం. వాణి తన జీవితం తాను చూసుకుంటుంది. ఇప్పటికైనా కొత్త జీవితం ప్రారంభించండి. పాత విషయాలు మర్చిపోండి. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండండి’ అని చెప్పి పంపించాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -