Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాని మోడీ యూరప్ పర్యటన..!

ప్రధాని మోడీ యూరప్ పర్యటన..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని పర్యటన ఉండబోతోంది. నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలో ఆయన పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నార్వేలో జరిగే భారత్-నార్డిక్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవ్వనున్నారు.

ఈ అధికారిక పర్యటన మే 15 నుంచి 20 వరకు జరిగే అవకాశం ఉంది. ముందుగా నార్వేలో పర్యటించిన తర్వాత స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు మధ్య మోడీ యూరప్ పర్యటన ఉండబోతోంది. ఈయూ-భారత్ ఒప్పందం కుదిరిన ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూరోపియన్ దేశాల వాణిజ్యం మరింత పెరుగనుంది. ఈ ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాత తొలిసారిగా మోడీ యూరప్ పర్యటనకు వెళ్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -