Wednesday, April 22, 2026
E-PAPER
Homeసినిమాగ్లోబల్‌ హంగులతో కొత్త సినిమా

గ్లోబల్‌ హంగులతో కొత్త సినిమా

- Advertisement -

ఇండియన్‌ సినిమాను గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజరు దేవరకొండ. ‘హాయ్‌ నాన్న’ ఫేమ్‌ డైరెక్టర్‌ శౌర్యువ్‌తో విజరు దేవరకొండ హ్యూజ్‌ గ్లోబల్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. వైరా బ్యానర్‌ ఈ ప్రెస్టీజియస్‌ మూవీని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌ ఇచ్చారు.
రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ హై ఎక్స్‌పెక్టేషన్స్‌ క్రియేట్‌ చేసింది. విజరు దేవరకొండ, డైరెక్టర్‌ శౌర్యువ్‌ సినిమాకు హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌, ఫాల్‌ ఔట్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌, బ్యాట్‌ మ్యాన్‌ ఫరెవర్‌, స్నోపియర్సర్‌ చిత్రాల వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌ ఎరిక్‌ డిస్ట్‌ ఈ మూవీకి పనిచేస్తున్నారు.
యానిమల్‌, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్‌ సెల్వరాజన్‌ ఈ సినిమా ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్‌ హిట్‌ చిత్రాల కంపోజర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహాబ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇండియన్‌ సినిమాకు గ్లోబల్‌ స్థాయి క్రేజ్‌ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజరు శౌర్యువ్‌ మూవీ కూడా ప్రయత్నిస్తోంది. మైథాలజికల్‌ యూనివర్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -