యమల్, క్రూస్‌లకు కూడా ప్రదానం
న్యూయార్క్: బెలారస్ స్టార్ అర్యానా సబలెంక, స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్‌లకు 2025 ఏడాదిలో టెన్నిస్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు అవార్డులు దక్కాయి. వీరిద్దరూ పురుషుల, మహిళల విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్ అవార్డుల వేడుకలో అల్కరాజ్, సబలెంక 2025 ఏడాది ఉత్తమ ఆటగాళ్లుగా కిరీటాన్ని అందుకున్నారు. టెన్నిస్ జగత్తుపై గత ఏడాది వీరిద్దరి హవా చెలాయించారు. 22ఏళ్ల స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్.. ఎటిపి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో పాటు గత ఏడాది ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఇక బెలారస్‌కు చెందిన 27ఏళ్ల సబలెంకా గత ఏడాది న్యూయార్క్ ఓపెన్‌తోపాటు ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరి రన్నరప్‌తో సరిపుచ్చుకుంది.
లారెస్ అవార్డు విజేతలు…
వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్ : కార్లోస్ అల్కరాజ్ (టెన్నిస్, స్పెయిన్)
వరల్డ్ స్పోర్ట్స్‌వుమెన్ ఆఫ్ ది ఇయర్ : అర్యానా సబలెంక(టెన్నిస్, బెలారస్)
వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ : పారిస్ సెయింట్ జెర్మన్ (ఫుట్‌బాల్ క్లబ్)
వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ : లాండో నొర్రిస్(ఫార్ములా-1 డ్రైవర్, బ్రిటన్)
వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ : రోరీ మెక్‌ల్రారు(గోల్ఫ్, బ్రిటన్)
వరల్డ్ స్పోర్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్ డిజేబిలిటీ : గాబ్రియేల్ అరౌజో(పారా స్విమ్మర్, బ్రెజిల్)
వరల్డ్ ఆక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ : చోలీ కిమ్(స్నోబోర్డర్, అమెరికా)
వరల్డ్ యంగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ : లామినే యమాల్ (ఫుట్‌బాల్, స్పెయిన్)
లారెస్ స్పోర్టింగ్ ఇన్సిపిరేషన్ అవార్డు : టోనీ క్రోస్(ఫుట్‌బాల్, జర్మనీ)
లారెస్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు : నదియా కొమానెసి (జిమ్నాస్టిక్; రొమేనియా)
లారెస్ స్పోర్ ఫర్ గుడ్ అవార్డు : ఫుట్‌బాల్ మోస్
అల్కరాజ్, సబలెంకలకు లారెస్ అవార్డులు
- Advertisement -
- Advertisement -



