రాయల్స్, సూపర్‌జెయింట్స్ ఢీ నేడు
లక్నో : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న తరుణంలో లక్నో సూపర్‌జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ ముఖాముఖికి పోరుకు సిద్ధమవుతున్నాయి. తొలి 4 మ్యాచ్‌ల్లో గెలుపొందిన రాజస్తాన్ రాయల్స్ ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. లక్నో సూపర్‌జెయింట్స్ సైతం చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. లీగ్ దశ ద్వితీయార్థం ఆరంభం కానున్న తరుణంలో గెలుపు బాట పట్టేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్ ఎక్కువగా వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ మెరుపులపైనే ఆధారపడుతోంది. పవర్‌ప్లేలో ఓపెనర్లు అదిరే ఆరంభం ఇవ్వకపోయినా.. భారీ స్కోర్లు సాధించేందుకు మిడిల్ ఆర్డర్ సిద్ధంగా ఉండాలి. అప్పుడే రాయల్స్ బలమైన ప్రత్యర్థులకు సవాల్ విసరగలదు. మరోవైపు లక్నో సూపర్‌జెయింట్స్ డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం ఆందోళనకరంగా మారింది. కెప్టెన్ రిషబ్ పంత్ పరుగుల వేటలో నిలకడగా నిరాశపరుస్తున్నాడు. జట్టును నడిపించేందుకు పంత్ ముందుగా బ్యాట్‌తో పరుగులు చేయాలి. ఎడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ అంచనాలకు తగినట్టు ఆడాలి. లేదంటే, సూపర్‌జెయింట్స్‌కు మరోసారి నిరాశ తప్పదేమో. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్‌లు ఆకట్టుకుంటున్నారు. కానీ ఆ ఇద్దరికి సరైన సహకారం దక్కటం లేదు. స్వల్ప స్కోర్ల లక్నోలో జరుగుతున్న మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
గెలుపు బాట పట్టేదెవరో?
- Advertisement -
- Advertisement -



