లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో అవకాశాలు : నార్వే వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకు రావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నార్వే వర్కింగ్ గ్రూప్ ప్రతి నిధులకు విజ్ఞప్తి చేశారు. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబ డులకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం నార్వే దేశ రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్ ప్రతినిధుల బృందం మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. తెలంగాణ, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక సహ కారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహా లపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ, పరిశ్ర మల ఏర్పాటుకున్న అనుకూల తలు, అవకాశాలను మంత్రి వారికి వివరించారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆఫ్‌షోర్ విండ్, క్లైమేట్ ఇన్నోవేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చ రింగ్, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ‘నార్వే’ గ్లోబల్ లీడర్ గా కొనసాగుతున్నదని కొనియాడారు. ఏఐ, క్లైమేట్ టెక్, హెల్త్ టెక్, డీప్ టెక్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబి లిటీ, క్లీన్ ఎనర్జీ, ఇండిస్టియల్ డీ కార్బనైజేషన్, గ్రీన్ మ్యాన్యు ఫ్యాక్చరింగ్, డిజిటల్ హెల్త్, బయోటెక్, మెడికల్ డివైజెస్ తదితర అంశాల్లో కలిసే పని చేసేందుకు గల అవకాశా లపై ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేసుకుని ముందుకెళ్దామని చె ప్పారు. దీనికోసం ప్రత్యేకంగా తెలం గాణ-నార్వే వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేద్దామని ప్రతి పాదించారు. దీనికి నార్వే ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. మంత్రితో సమావేశంలో నార్వే ఇన్నోవేషన్ హెడ్ బ్యోర్న్ ఐవర్సన్, ఫస్ట్ సెక్రెటరీ సిల్జే క్రిస్టీన్ ఆండర్స న్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సిరి వెసెత్ మెలింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇటలీ రాయబారితో భేటీ
ఇటలీ దేశ రాయబారి ఆంటోనియో బార్టోలి నేతృత్వం లోని ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఏయే రంగాల్లో తెలంగాణ – ఇటలీ కలిసి పని చేయాలనే అంశాలపై చర్చించారు. ఐరోపాలోఅత్యంత బలమైన ఎగు మతి ఆధారిత, ఉత్పాదక రంగం కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో ఇటలీ ప్రధానంగా కొనసాగుతున్నదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జీనోమ్‌వ్యాలీ విస్తరణ
జీనోమ్‌వ్యాలీలో మెడికల్ డివై సెస్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనీ, ఆమేరకు జీనోమ్‌వ్యాలీని విస్తరిస్తా మనీ, తక్షణమే ఇక్కడి నుంచి ఉత్పత్తి ప్రారంభించవచ్చని చెప్పారు. మంగళ వారం సచివాలయంలో తనను కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారి శ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధ కులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధన లు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలం గాణా అత్యంత అనుకూలమని వివరించారు. ఇప్పటికే రాష్ట్రం ఔష ధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఇమేజింగ్ టెక్నా లజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబ డులకు అనుకూలమని వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపం చంలోని అతిపెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూని వర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించా లని సూచించారు. సమావేశంలో నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహా దారు ఐ.సాయికృష్ణ, టీజీఐఐసీ ఎమ్డీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, స్పెషల్ సెక్రెటరీ రఘు రామశర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్‌సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



