Wednesday, April 22, 2026
E-PAPER
Homeజాతీయంచమురు దిగుమతుల్లో భారీ పతనం

చమురు దిగుమతుల్లో భారీ పతనం

- Advertisement -

న్యూఢిల్లీ : ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా హార్ముజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడంతో భారత్‌ ముడిచమురు దిగుమతులు భారీగా తగ్గాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో దిగుమతులు 13 శాతం క్షీణించి రోజుకు 4.5 మిలియన్‌ బారెల్స్‌కు పరిమితమ య్యాయి. అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే సరఫరా 61 శాతం మేర పడిపోవడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు భారత్‌ రష్యా నుంచి దిగుమ తులను భారీగా పెంచింది. ప్రస్తుతం భారత్‌ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో రష్యా వాటా దాదాపు సగానికి లేదా 2.25 మిలియన్‌ బారెల్స్‌కు చేరింది.
హార్ముజ్‌ జలసంధిలో అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన కారణం గా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు నెలల్లో కేవలం కొన్ని ట్యాంకర్లు మాత్రమే భారత్‌కు చేరుకోగా శనివారం ఈ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాల వల్ల భారత చమురు దిగుమతు ల్లో పశ్చిమాసియా వాటా మునుపెన్నడూ లేని విధంగా 26.3 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఇరాక్‌, యుఎఇల నుంచి దిగు మతులు కనిష్ట స్థాయికి చేరగా రష్యా అగ్ర స్థానంలో, సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచాయి. పశ్చిమాసియాకు ప్రత్యామ్నా యంగా ఆఫ్రికా దేశాల నుంచి కూడా భారత్‌ దిగుమతులను పెంచుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -